రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. సప్త వాహన సేవలపై స్వామివారు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహన సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కుటంబు సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. కన్నులపండువగా జరిగిన సేవలను వేలాదిమంది భక్తులు వీక్షించి తన్మయత్వం పొందారు. రథసప్తమి పర్వదినాన శ్రీవారి ఏడు వాహన సేవలను చూసి తరించటంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి