ETV Bharat / city

సులువుగా శ్రీవారిని దర్శించుకునేందుకు 'శ్రీవాణి'కి విరాళం - donations

ఎల్​1, ఎల్​2,ఎల్​3 దర్శనాలను రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం సహా అరుదైన ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా దళారులకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.

శ్రీవాణి
author img

By

Published : Aug 20, 2019, 5:02 AM IST

తిరుమల శ్రీవేంకటేశ్వస్వామివారి దివ్యమంగళస్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తకోటి పరితపిస్తుంటుంది. వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోసం కొందరు భక్తులు ఖర్చుకు వెనుకాడరు. అలాంటి వారికే దళారులు వల వేస్తుంటారు. అందినకాడికి దండుకుంటుంటారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఇప్పటికే శతవిధాలా ప్రయత్నిస్తున్న తిరుమల తిరుపతిదేవస్థానం కొత్త సంస్కరణలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మే 25న శ్రీవాణి ట్రస్ట్‌ను తితిదే ప్రారంభించింది. ఈ ట్రస్టు ద్వారా అమరావతిలో శ్రీవారి ఆలయంతోపాటు దళిత, గిరిజన, మారుమూల గ్రామాల్లో మందిరాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

ఆలయాల నిర్మాణం అందులో ధూపదీప నైవేద్యాలకు అవసరమైన నిధులను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమకూర్చుకోవాలని తితిదే భావిస్తోంది. శ్రీవాణి ట్రస్టుకు10వేల రూపాయల విరాళమిస్తే వారికి తీర్థ, శఠారిలతో కూడిన బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారు. తొలుత రోజుకు 200టిక్కెట్లతో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి ఈ ట్రస్టును మరింతగా విస్తరించేలా విధానాలను రూపొందించారు. అధికమొత్తంలో విరాళం అదించే వారికి అత్యంత విశిష్ఠమైన వస్త్రాలంకంరణ సేవ, అభిషేకం, తోమాల, అర్చన వంటి సేవా టికెట్లూ కేటాయించాలని తితిదే భావిస్తోంది. భక్తుల ఆదరణను బట్టి రోజుకు వేయి బ్రేక్‌ దర్శన టిక్కెట్లను శ్రీవాణి ట్రస్టుకు కేటాయించనున్నారు. తద్వారా రోజుకు కోటి రూపాయల చొప్పున ఏటా 360 కోట్లు ట్రస్టుకు సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు.తిరుమలలోని ముఖ్య ప్రాంతాల్లో విరాళాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు యోచిస్తున్నారు. తితిదే ధర్మకర్తల మండలి ఆమోదంతో ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.

Intro:AP_RJY_62_19_TEACHERS_SEXUALGIRLS_AVB_AP10022Body:AP_RJY_62_19_TEACHERS_SEXUALGIRLS_AVB_AP10022Conclusion:AP_RJY_62_19_TEACHERS_SEXUALGIRLS_AVB_AP10022
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.