ఈరోజు సాయంత్రం తితిదే పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేయనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 24 మంది సభ్యులతో కొత్త పాలకమండలి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి పాలకమండలిలో కొత్త వారికి ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని తెలిపిన తితిదే ఛైర్మన్.. తెలుగు రాష్ట్రం కనుక తెలంగాణకు మిగతా రాష్ట్రాల కంటే ప్రాధ్యాన్యం కల్పిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: