కళ్యాణమస్తు ద్వారా ఉచిత వివాహాలకు తితిదే దరఖాస్తులు ఆహ్వానించింది. మే 28న రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఉచిత సామూహిక వివాహాలు జరిపించనుంది. దంపతులకు మంగళసూత్రంతో పాటు వస్త్రాలు, బోజనాలు ఉచితంగా అందించనున్నారు.
www.tirumala.org లో, ఆయా జిలాల్లోని హిందూధర్మ ప్రచార పరిషత్ అసిస్టెంట్ వద్ద దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. మే 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మే 28న నిర్ణయించిన సమయంలో వివాహాలు జరగనున్నట్లు తితిదే వెల్లడించింది.
ఇదీ చదవండి:
తితిదే ఈవో జవహర్ రెడ్డి తీరును నిరసిస్తూ కార్మిక సంఘాల ధర్నా