ETV Bharat / city

తిరుపతిలో 'గో మహా సమ్మేళనం'.. కొనసాగుతున్న ఏర్పాట్లు

తిరుపతిలో గో మహా సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దాదాపు వెయ్యి మందితో ఏర్పాటు చేస్తున్న ఈ సమ్మేళనంలో.. కీలక అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు.

Ttd
Ttd
author img

By

Published : Oct 14, 2021, 3:45 PM IST

ప్రకృతి వ్యవసాయం, గో రక్షణపై అవగాహన కల్పించేందుకు "గో మహా సమ్మేళనం" నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త విజయరామ్‌, యుగతులసీ ట్రస్టు ఛైర్మన్‌ శివకుమార్‌ సమన్వయంతో.. ఈ నెల 30, 31 తారీఖుల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

ఈ మహా సమ్మేళనంలో గోవు ఆధారిత వ్యవసాయం, దేశీ విత్తనాలు, దేశీ గోవులు, గిట్టుబాటు ధరలు, వర్షపు నీటిని సంరక్షించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమ్మేళనానికి వచ్చే వారికి ఉచిత వసతి కల్పించి, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పదార్థాలతో భోజనం అందించడమే కాకుండా.. శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేయి మందితో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం- కోలుకోవాలని ప్రధాని ఆకాంక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.