ETV Bharat / city

కొత్త ఈవో ముందు కొండంత సవాళ్లు - ttd latest news

తితిదే నూతన ఈవోగా నియమితులైన కేఎస్ జవహర్​రెడ్డికి...సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. శనివారం ఆయన తితిదే ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. కరోనా కారణంగా తితిదే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గడిచిన ఎనిమిది నెలలుగా ఆదాయం లేకపోగా.. ఉద్యోగుల జీతాలు, కొవిడ్ నియంత్రణ చర్యలు భారంగా మారాయి. కొత్త ఈవోకు ఆదాయ, వ్యయాలను సమన్వయం చేస్తూ ఆర్థిక సమస్యల నుంచి తితిదేను గట్టెక్కించడం ప్రధాన సవాలు కానుంది.

కొత్త ఈవో ముందు కొండంత సవాళ్లు
కొత్త ఈవో ముందు కొండంత సవాళ్లు
author img

By

Published : Oct 10, 2020, 7:07 AM IST

ప్రపంచంలోనే ధనిక ధార్మిక సంస్థగా గుర్తింపు పొందిన తితిదే... కరోనా ప్రభావంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో తితిదేకు వివిధ మార్గాల్లో సమకూరే దాదాపు రూ.రెండు వేల కోట్ల ఆదాయానికి గండిపడింది. 75 నుంచి 80 వేల మందికి దర్శనాలు చేయించే స్థాయిలో మౌలిక వసతులు ఉన్నా... కరోనా ప్రభావంతో రోజుకు పదమూడు వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఫలితంగా హుండీ, తలనీలాలు, భక్తుల వసతిగృహాల అద్దెలు, లడ్డూ విక్రయాలు వంటి మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా ఉంది.

కరోనా నుంచి బయటపడి సాధారణ పరిస్థితులు నెలకొనడం ద్వారా పూర్తి స్థాయిలో భక్తులను దర్శనాలకు అనమితిస్తే తప్ప తితిదే ఆదాయం తిరిగి పట్టాలెక్కే అవకాశం లేదు. సగటున నెలకు రూ.250 నుంచి 280 కోట్ల ఆదాయం ఉన్న తితిదేకు గత ఏడు నెలల కాలంలో ఖజానాకు చేరింది నామమాత్రమనే చెప్పాలి. ఆదాయ మార్గాలు మూసుకుపోగా....ఉద్యోగుల జీత భత్యాలు, ఆలయాల నిర్వహణ ఖర్చులు యథాతథంగా ఉన్నాయి. కరోనా ప్రభావం ఉద్యోగులు, అర్చకులపై పడకుండా తీసుకుంటున్న రక్షణ చర్యలతో నిర్వహణ వ్యయం మరింత పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3309 కోట్ల అంచనాతో బడ్జెట్‌ రూపొందించగా...ఆర్థిక సంవత్సరంలోని మూడు త్రైమాసికాలు ఎలాంటి ఆదాయం లేకుండా గడచిపోయాయి. మరో మూడు నెలల్లో బడ్జెట్‌ అంచనాలను చేరుకోవడానికి ఎలాంటి విధానాలను అనుసరిస్తారన్నది చర్చ సర్వత్రా సాగుతోంది.

ఆదాయాలు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లతో పాటు ఇతర వ్యయాల కోసం సగటున నెలకు రూ.120 నుంచి 140 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఈవోకు ఆదాయ, వ్యయాలను సమన్వయం చేస్తూ ఆర్థిక సమస్యల నుంచి తితిదేను గట్టెక్కించడం ప్రధాన సవాలు కానుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్‌, విరామ సమయ దర్శనాలు మాత్రమే కొనసాగిస్తుండటంతో సామాన్యులకు శ్రీవారిని దూరం చేశారన్న విమర్శలు ఉన్నాయి. కరోనా తీవ్రత కొనసాగుతున్న తరుణంలో సర్వదర్శనాలను పునరుద్ధరించడం ద్వారా విమర్శలకు సమాధానం ఇవ్వడం కష్టం కానుంది. గడచిన ఏడు నెలలుగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలు ప్రతి ఉత్సవం....ఏకాంతంగా నిర్వహించారు.

కరోనా సమయంలో తొలిసారిగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. వాహనసేవలపై శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చే భక్తుల ద్వారా కొవిడ్‌ నిబంధనలను పాటింపజేయడం....వైరస్‌ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడం అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు కొత్త ఈవో ముందు మరికొన్ని సవాళ్లు ఉన్నాయి. నోట్ల మార్పిడి సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న భక్తులు సమర్పించిన కానుకల్లో పాతనోట్లు తితిదే ఖాజనాలో భారీగా మిగిలిపోయాయి.

కొత్త ఈవో ముందున్న సవాళ్లు

  1. పాత 6.34 లక్షల రూ. ఐదు వందల నోట్లు, 1.8 లక్షల రూ. వెయ్యి నోట్లు రిజర్వు బ్యాంక్‌కు చేర్చడం ద్వారా తితిదే ఆదాయం పెంచడం
  2. కరోనాతో కోల్పోయిన ఆదాయాన్ని పూడ్చుకొంటూ 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ జనవరి, ఫిబ్రవరి నెలలో రూపొందించడం
  3. ఇప్పటికే ప్రారంభించిన తితిదే పరిధిలోని విద్యార్థుల వసతిగృహాలు, గరుడవారధి, పీఏసీ-5 నిర్మాణాలకు నిధులను సర్దుబాటు చేయడం
  4. దేశ వ్యాప్తంగా తితిదే పరిధిలో ఉన్న 49 ఆలయాల నిర్వహణకు సరిపడా నిధుల కేటాయింపు
  5. బ్యాంకుల్లో స్వామివారి నిధులను డిపాజిట్‌ చేయడమే తప్ప....డ్రా చేయని చరిత్రను కాపాడుకొంటూ కార్యక్రమాలు నిర్వహించడం
  6. సామాన్యులకు సర్వ దర్శనాల పునరుద్ధరణ
  7. వంశపారంపర్య హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆలయ గౌరవ ప్రధాన అర్చకుల సమస్యను పరిష్కరించడం
  8. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానికులకు 75 శాతం ఉద్యోగ నియామకాల అమలు
  9. బ్యాంకుల్లో ఉన్న స్వామివారి నిధులు రూ.పద్నాలుగు వేల కోట్ల డిపాజట్లను డ్రా చేయకుండా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం
  10. స్వామివారి నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ బాండ్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయం విమర్శల నేపథ్యంలో అమలు

ఇదీ చదవండి న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.