తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రంగనాయకుల మండపానికి చేరుకున్న రాజీవ్ కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కొన్ని రోజుల క్రితం ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రాజేష్ శర్మలు తానే సభ్యుడినంటూ తితిదే వద్దకు రావటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకరికి బదులు మరొకరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమైన పరిస్థితులు తలెత్తాయి. చివరకు ముంబైకి చెందిన వ్యక్తే బోర్డు సభ్యుడని నిర్థారణకు వచ్చిన తితిదే.. ఆయనతో ఇవాళ ప్రమాణం చేయించింది. మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన హైదరాబాద్ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు గోవింద హరి కుడా ప్రమాణం చేశారు.
తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం - తితిదేలో గందరగోళం
తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేష్శర్మ, మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన హైదరాబాద్కు చెందిన గోవిందహరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
![తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4661081-758-4661081-1570275539372.jpg?imwidth=3840)