ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహణపై స్పష్టత కోసం ఆరోగ్యశాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుపతిలో అలిపిరి వద్ద కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. ఈ తరుణంలో ఏప్రిల్ 7న జరగనున్న రాముల వారి కల్యాణానికి లక్షమందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని అనుసరించి కల్యాణోత్సవాన్ని ఆలయం వరకే పరిమితం చేయటమా... లేక యథావిధిగా నిర్వహించటమా అనే అంశంపై స్పష్టత వెలువడుతుందని అన్నారు.
ఇదీ చదవండి :
శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ