ETV Bharat / city

TTD: త్వరలో అందుబాటులోకి తితిదే ఉత్పత్తులు: ఈవో జవహర్

తితిదే ఆలయాల్లో ఉపయోగించిన పూల మాలలతో తయారు చేసే పరిమళభరితమైన అగరబత్తులు సెప్టెంబరు మొదటి వారంలో భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Aug 23, 2021, 10:12 PM IST

త్వరలో అందుబాటులోకి తితిదే ఉత్పత్తులు
త్వరలో అందుబాటులోకి తితిదే ఉత్పత్తులు

తితిదే ఆలయాల్లో ఉపయోగించిన పూల మాలలతో తయారు చేసే పరిమళభరితమైన అగరబత్తులు సెప్టెంబరు మొదటి వారంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తితిదే పరిపాలన భవనంలోని తన ఛాంబర్‌లో సోమవారం గోసంరక్షణశాల, ఆయుర్వేద కళాశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి భక్తులకు ఆకర్షణీయమైన డిజైన్‌లతో రూపొందించిన 7 రకాల బ్రాండ్లతో తయారు చేసిన అగరబత్తులు సెప్టెంబరు మొదటి వారంలో విక్రయించడానికి ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, కొబ్బరికాయల కౌంటర్‌, గోశాల, తిరుచానూరు పద్మావతి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం, విష్ణు నివాసం, శ్రీనివాసంలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఈవో...పంచగవ్య ఉత్పత్తులపై సమీక్షించారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ సంస్థ సహకారంతో ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు తయారు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఉత్పత్తులకు సంబంధించి ఈనెలలోనే విధి విధానాలు రూపొందించాలన్నారు. ఇందుకోసం డీపీడబ్ల్యూ స్టోర్స్‌లో అవసరమైన సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచగవ్య ఉత్పత్తులకు సంబంధించి లైసెన్స్‌, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌, తదితర అంశాలపై సమీక్షించారు.

పంచ‌గ‌వ్య ఉత్పత్తులైన దివ్య మంగ‌ళ ధూప్‌చూర్ణం, అగరబత్తులు, సాంబ్రాణి కప్‌లు, ధూప్ స్టిక్స్‌, ధూప్ కోన్‌లు, విబూది, హెర్బల్‌ టూత్ పౌడర్, ఫేస్‌ప్యాక్‌, సోప్, షాంపూలు, సంజీవ‌ని - నాజల్ డ్రాప్స్‌, గో తీర్థ్ - గో ఆర్క్, పావ‌ని - హెర్బల్ ఫ్లోర్ క్లీనర్‌, గోపాల- ఆవు పేడ కేక్‌, ఆవు పేడ దుంగలు త‌దిత‌ర వాటిని సిద్ధం చేయాల‌న్నారు.

ఇదీ చదవండి

రేపు అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు చెల్లించనున్న ప్రభుత్వం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.