![ttd EO jawahar reddy examined SV Ayurvedic Pharmacy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-20-ttd-eo-visit-sv-ayurveda-pharmacy-av-3038178_20012021160130_2001f_1611138690_737.jpg)
చిత్తూరు జిల్లా నరసింగాపురంలోని ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ, నర్సరీని తితిదే ఈవో జవహర్‌రెడ్డి పరిశీలించారు. ఆయుర్వేద ఫార్మసీలో ముడి పదార్థాలు, పరిశోధన శాల, మందుల తయారీ విభాగం, ఆయుర్వేదంపై విద్యార్థులకు అవగాహన కల్పించేదుకు ఏర్పాటు చేసిన ప్రదర్శన శాల, నర్శరీని సందర్శించారు.
![ttd EO jawahar reddy examined SV Ayurvedic Pharmacy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-20-ttd-eo-visit-sv-ayurveda-pharmacy-av-3038178_20012021160130_2001f_1611138690_496.jpg)
![ttd EO jawahar reddy examined SV Ayurvedic Pharmacy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-20-ttd-eo-visit-sv-ayurveda-pharmacy-av-3038178_20012021160130_2001f_1611138690_24.jpg)
ఆయుర్వేద ఫార్మసీ ఇన్‌ఛార్జి డాక్టర్ నారపరెడ్డి ఆయుర్వేద మందుల తయారీని ఈవో, జేఈవోలకు వివరించారు. అనంతరం ఈవో జవహర్‌రెడ్డి ఫార్మసీ భవనాలను, ముడి పదార్థాలు, మందులు నిల్వ ఉంచే గోడౌన్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
![ttd EO jawahar reddy examined SV Ayurvedic Pharmacy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-20-ttd-eo-visit-sv-ayurveda-pharmacy-av-3038178_20012021160130_2001f_1611138690_662.jpg)
ఇదీ చదవండి: శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల