తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఈవో కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా... తితిదే ఈవో జవహర్ రెడ్డి తిరుపతిలోని తన నివాస భవనంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా రాష్ట్ర రాజధానిలో గవర్నర్, ఆయా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లు ఎట్ హోం కార్యక్రమం జరుపుతారు. ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరై తేనీటి విందు స్వీకరిస్తారు.
ఈ ఏడాది తొలిసారిగా తితిదే ఈవో తిరుపతిలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి శాసన సభ్యులు కరుణాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంత కృష్ణన్ వేణుగానం, బ్యాండ్ మేళం బృందం దేశ భక్తి గీతాలు ఆహూతులను అలరించాయి.
ఇదీ చదవండి:
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంపు.. ఉత్తర్వులు జారీ