500, వేయి రూపాయల నోట్ల రద్దు తరువాత శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన పాత నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. 1.8 లక్షల రూపాయల వేయి రూపాయల నోట్లు, 6.34 లక్షల 500 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకులో గానీ... ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఆలయ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్ బలగాల జీతాల చెల్లింపులో.. 2014 ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30వ తేదీ వరకు బకాయి ఉన్న 23.78 కోట్ల రూపాయల జీఎస్‌టీని రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి వైవీ సుబ్బారెడ్డి వినతిపత్రం సమర్పించారు.