తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా రెండవసారి పదవీ వరించడంతో శ్రీవారి మెట్టు మార్గం గుండా వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు నడిచి వెళ్ళారు. శ్రీవారి మెట్టు వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో చొరవ చూపుతానని దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కరోనా మహమ్మారి నుంచి రక్షింపబడాలని స్వామివారిని వేడుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.