తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా అందచేస్తామని ప్రచారం చేసుకుంటున్న www.balajiprasadam.com వెబ్‌సైట్‌పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్సైట్ వివరాలు సేకరించి సంబంధిత వ్యక్తులపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఐటీ విభాగం సహాయంతో వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించాలని సూచించారు. శ్రీవారి ప్రసాదాల పేరుతో భక్తులను మోసం చేస్తున్న విషయం ఛైర్మన్ దృష్టికి రావటంతో స్పందించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి