తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తమిళనాడు కాంచీపురంలోని అత్తవరదర్ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తితిదే తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి.. శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం