ETV Bharat / city

అమెజాన్​లో తితిదే క్యాలెండర్లు, డైరీలు

భక్తుల సౌకర్యం దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తితిదే రూపొందించిన 2021 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను భక్తులకు తితిదే వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా పొందే అవ‌కాశాన్ని క‌ల్పించింది. విదేశాల్లోని భక్తులకు తపాలా శాఖ ద్వారా అందిస్తామని తితిదే తెలిపింది.

in amazon tdd calendars and dairy delivery services
అమెజాన్​లోనూ లభించనున్న తితిదే క్యాలెండర్లు, డైరీలు
author img

By

Published : Nov 4, 2020, 8:51 PM IST

తితిదే ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 2021 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను తితిదే వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా బుక్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. తితిదేకు చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్​సైట్‌లో బుక్ చేసుకున్న భక్తులకు త‌పాలా శాఖ ద్వారా అందజేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. క్యాలెండ‌ర్లు, డైరీల‌ు కావాల్సినన్ని కొనుగోలు చేయవచ్చన్నారు. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్‌, రవాణా ఛార్జీలు అద‌నంగా వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

విదేశీ భక్తులకు ..

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న విదేశీ భక్తులకు త‌పాలా శాఖ ద్వారా బట్వాడా చేసేందుకు చర్యలు చేపట్టింది. తపాలా ద్వారా డైరీలు కొనుగోలు చేయాలని భావించే భక్తులు కార్యనిర్వహణాధికారి, తితిదే, తిరుపతి పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్‌ లెటర్‌ను ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి'' అనే చిరునామాకు పంపాలని తితిదే అధికారులు సూచించారు.

తితిదే సమాచార కేంద్రాల్లో...

12 పేజీల క్యాలెండర్‌, చిన్న డైరీ రూ. 100, పెద్ద డైరీ రూ. 130, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ. 60, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ. 20కి అందుబాటులో ఉన్నట్లు తితిదే ప్రకటించింది. తిరుమల, తిరుపతిలోని తితిదే పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంచడంతోపాటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని తితిదే సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది.

ఇదీ చూడండి:

సింహపురి గ'ఘన' స్వప్నం సాకారమయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.