DOLLAR SESHADRI DEATH: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరణం తితిదేకు తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. శేషాద్రితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. ధర్మారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
ఆలయంలో జరిగే కార్యక్రమాలు భవిష్యత్‌లో క్రమం తప్పకుండా జరిగేందుకు వీలుగా మాన్యువల్‌ను తయారు చేసినట్లు చెప్పారు. శేషాద్రి స్వామి నిత్యం ధరించి ఉండే డాలర్‌ను 6 నెలల క్రితమే తనకు బహుకరించారని ధర్మారెడ్డి చెప్పారు. అయితే.. తాను వద్దని చెప్పడంతో ఆయన గదిలోని శ్రీవారి విగ్రహం వద్ద ఉంచారని, తన తదనంతరం తీసుకోవాలని కోరినట్లు ధర్మారెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: