అమరావతి ఉద్యమానికి మద్దతుగా తిరుపతి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళన నిర్వహించారు. తిరుపతి నగరంలోని మంగళం రోడ్డులో భవన నిర్మాణ కార్మికుల వేషం ధరించి విద్యార్థి సంఘ నాయకులు నిరసన చేపట్టారు. రాజధాని మారిస్తే పరిపాలన అస్తవ్యస్తం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాల కారణంగా యువతరం ఉపాధి అవకాశాలు కోల్పోయారని.. కూలి పనులు చేసుకోవాల్సి వస్తుందంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో స్పాట్ ఇసుక బుకింగ్!