ఇదీ చదవండి
తిరుపతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి: పనబాక లక్ష్మి
దొంగ ఓట్లతో తిరుపతి పవిత్రను దెబ్బతీశారని.. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విమర్శించారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని తెదేపా అభ్యర్థులను అక్రమంగా బయటికి లాగేస్తున్నారని అన్నారు. స్వయంగానే తానే ఇద్దరు దొంగ ఓటర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించానని చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ప్రశ్న తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. 12 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలు కూడా ఓట్లు వేయడం దారుణమన్నారు. వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి.. రీపోలింగ్ కోరుతామని ఈటీవీ భారత్ ముఖాముఖిలో పనబాక లక్ష్మి తెలిపారు.
tirupati tdp candidate panabaka lakshmi
ఇదీ చదవండి
TAGGED:
తెదేపా నేత పనబాక లక్ష్మి