తిరుపతిలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రాకూడదని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే... దుకాణాలు సీజ్ చేసి, వర్తక లైసెన్స్‌ను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే అర్బన్ హెల్త్ సెంటర్లను సంప్రదించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నగరంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకునేవారు కింద తెలిపిన చిరునామాలను సంప్రదించాలని కోరారు.
- అర్బన్ హెల్త్ సెంటర్ బైరాగి పట్టెడ, మీసేవ
- అర్బన్ హెల్త్ సెంటర్ స్కాన్జర్స్ కాలనీ, చేపల మార్కెట్ ఎదురుగా
- అర్బన్ హెల్త్ సెంటర్, సిమ్స్ హాస్పిటల్ సర్కిల్, నెహ్రూ నగర్
- అర్బన్ హెల్త్ సెంటర్, పోస్టల్ కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, రేణిగుంట రోడ్డు
- అర్బన్ హెల్త్ సెంటర్, ఆటోనగర్, రేణిగుంట రోడ్డు
- అర్బన్ హెల్త్ సెంటర్, శివ జ్యోతి నగర్, అంబేడ్కర్ విగ్రహం దగ్గర జీవకోన
- హార్ట్ హెల్త్ సెంటర్, పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ప్రకాశం రోడ్డు
- మున్సిపల్ హెల్త్ సెంటర్, ప్రకాశం రోడ్డు
- అర్బన్ హెల్త్ సెంటర్ ఎర్ర మిట్ట, లీలామహల్ రోడ్డు, తిరుపతి
ఇదీ చదవండి :