యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి అన్నారు. తిరుపతి అర్బన్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయన బాధితురాలి తల్లితో మాట్లాడారు. అంతకు ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దిశ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయాలని చూడగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.
ఈ దారుణంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లితో మాట్లాడిన ఎస్పీ... ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీని ప్రత్యేకాధికారిగా నియమించి కేసు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్న ఆరోపణలపైనా విచారణ జరిపి వాస్తమని తేలితే.. పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.
ఇవీ చదవండి..