ETV Bharat / city

Tirumala Udayasthamana Tickets: శ్రీవారి ఉదయాస్తమాన టికెట్‌ ధర కోటి.. ప్రత్యేకతలు ఇవే! - Tirumala Udayasthamana Tickets

Tirumala Udayasthamana Tickets: తిరుమల శ్రీనివాసుడి సేవలో తరించేందుకు.. తితిదే మరోసారి అవకాశం కల్పించింది. స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్‌ ధర.. రూ.కోటి గా నిర్ణయిస్తూ తితిదే ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది.

tirumala ubhayasthamana tickets price increased to 1crore rupees
శ్రీవారి ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు రూ.కోటి
author img

By

Published : Dec 21, 2021, 10:01 PM IST

Tirumala Udayasthamana Tickets: సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు రూ.కోటి.. శుక్రవారం రోజున రూ.కోటిన్నరగా తితిదే పాలకమండలి నిర్ణయించింది. తితిదే వద్ద 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టిక్కెట్లపై.. 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం లభిస్తోంది. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యముంటుంది.

ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల కేటాయింపుతో.. తితిదేకు సుమారుగా రూ.600 కోట్లు ఆదాయం లభించే అవకాశముంది. వీటి ద్వారా లభించే మొత్తాన్ని.. చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని.. పాలకమండలి నిర్ణయించింది. టిక్కెట్లు పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

AP Governor: గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​కు​ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.