ETV Bharat / city

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత - తిరుమలలో దర్శనం నిలిపివేత

వారంరోజుల పాటు తిరుమలలో దర్శనం నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి చేరుకుని టైమ్​స్లాట్ టోకెన్లు తీసుకున్నవారికి ఈరోజు రాత్రి దర్శనం కల్పించి.. అనంతరం దర్శనాలు నిలిపివేస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

tirumala-temple-vision-stop-due-to-corona
తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత
author img

By

Published : Mar 19, 2020, 6:18 PM IST

Updated : Mar 19, 2020, 7:39 PM IST

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం నిలిపివేశారు. ప్రస్తుతానికి వారంరోజులపాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

" ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్​కి చెందిన దయాశంకర్ అనే వ్యక్తి.. తన గ్రామానికి చెందిన 110 మందితో తిరుమలకు వచ్చాడు. అతను 20 ఏళ్ల నుంచి సీవోపీడీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చాక అతనికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడికి ఐసోలేషన్​ వార్డులో చికిత్స చేశాం. అనంతరం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించాం. ఆ ఫలితాలు వచ్చాక అందరితో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. ముందుజాగ్రత్తగా అతనితోపాటు వచ్చిన 110 మందిని ఐసోలేషన్​లో ఉంచాం. వారు ఎవరెవరిని కలిశారో వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా'మని ఈవో అనిల్ తెలిపారు.

"ఆ భక్తునికి కరోనా లక్షణాలు కనిపించిన కారణంగా వారంపాటు దర్శనం నిలిపివేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే తిరుపతి చేరుకుని టైమ్​స్లాట్ టోకెన్లు తీసుకున్నవారికి మాత్రం ఈ రాత్రికి దర్శనం కల్పిస్తాం. అనంతరం నిలిపివేస్తాం. ఘాట్​రోడ్లు, కల్యాణకట్ట అన్నీ మూసివేశాం. అయితే స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలన్నీ అర్చకులు ఏకాంతంలో నిర్వహిస్తారు. తిరుమలే కాకుండా పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజుల ఆలయంలో కూడా దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలి. ఈనెల 22 నుంచి ఒంటిమిట్టలో జరగాల్సిన కోదండరామాలయం ఉత్సవాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం'మని తితిదే ఈవో అనిల్ కుమార్ తెలిపారు.

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత

ఇవీ చదవండి:

తిరుమలలో భక్తునికి కరోనా లక్షణాలు..?

Last Updated : Mar 19, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.