దేశం నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు అభయప్రదానం చేస్తూ.. భక్తజన గోవింద నామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా సాగే కలియుగ వైకుంఠనాథుడు, దేవదేవుని బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నిరాడంబరంగా సాగనున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని వణికిస్తున్న తరుణంలో కొవిడ్ వ్యాప్తి నివారణ కోసం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివస్తే కరోనా వ్యాప్తి తీవ్రమవుతుందని భావించిన తితిదే.. బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రాకారంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొంది. దీంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రాకారంలో ఏకాంతంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనుండటంతో వాహన సేవల సమయాలలో మార్పు చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహనసేవలను ఓ సారి పరిశీలిస్తే..
- 18.09.2020 శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అంకురార్పణ.
- 19.09.2020 శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల వరకు ధ్వజారోహణం. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహనం.
- 20.09.2020 ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు చిన్నశేష వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంసవాహనం.
- 21.09.2020 సోమవారం ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు సింహవాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనం.
- 22.09.2020 మంగళవారం ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు కల్పవృక్షవాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనం.
- 23.09.2020 బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు మోహినీ అవతారం. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు గరుడ సేవ.
- 24.09.2020 గురువారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు హనుమంత వాహనం. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గజ వాహనం.
- 25.09.2020 శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు సూర్యప్రభ వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
- 26.09.2020 శనివారం ఉదయం 7 గంటలకు సర్వభూపాల వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనం.
- 27.09.2020 ఆదివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ద్వజావరోహణం.
సాధారణ రోజుల్లో పల్లకీ ఉత్సవం, తిరుచ్చి సేవలు తిరువీధుల్లో నిర్వహించిన అనతరం శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం క్రతువు పూర్తి చేసేవారు. ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండటంతో చక్రస్నానం ఆలయ ప్రాకారంలోని అయన్‌మహల్‌లో చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: