తితిదే అటవీ విభాగం నియమనిష్టలతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల చాపను.. 205 అడుగుల తాడును దర్భతో తయారు చేస్తారు. ధ్వజారోహణం సమయంలో ఆలయంలోని ధ్వజ స్తంభానికి చాపను చుడుతారు. తాడుతో ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. శనివారం సాయంత్రం 6 నుంచి 6:30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించి.. బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇదీ చదవండి:రికార్డ్ స్థాయిలో: కొత్తగా 97,894 కేసులు, 1132 మరణాలు