TTD Tickets: తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. దర్శన టికెట్ల విడుదలలో జాప్యం - tirumala special darshan tickets updates
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీలో.. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవాళ ఉదయమే ఆన్ లైన్ లో విడుదల చేస్తామని తితిదే వెల్లడించినా.. ఇప్పటికీ విడుదల కాలేదు.

tirumala special tickets release become late due to technical issues
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా.. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీలో జాప్యం అవుతోంది. ఉదయం 11 గంటలకే టికెట్లు విడుదల చేస్తామని తితిదే ప్రకటించింది.
రోజుకు మూడు వేల టికెట్ల చొప్పున శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా టికెట్ల జారీ ఆలస్యమైంది. సమస్యను టీసీఎస్ సంస్థ పరిష్కరిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది.
ఇదీ చదవండి: