ETV Bharat / city

శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవల వర్చువల్ టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల వర్చుల్​ టికెట్లను తితిదే రేపటి నుంచి ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనుంది. నవంబరు 22 నుంచి 30వ తేదీ టికెట్ల కోటాను రేపు ఉదయం 11 గంటలకు తితిదే వెబ్​సైట్​లో విడుదల చేయనున్నారు.

Tirumala
Tirumala
author img

By

Published : Nov 12, 2020, 8:41 PM IST

తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను తితిదే.. రేపటి నుంచి ఆన్​లైన్​లో అందుబాటులోకి తీసుకురానుంది. స్వామివారి కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవలకు సంబంధించి నవంబరు 22 నుంచి 30వ తేదీ వరకూ టిక్కెట్ల కోటాను రేపు ఉదయం 11 గంటలకు తితిదే వెబ్​సైట్​లో విడుదల చేయనున్నారు. వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్​లైన్​లో కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులకు ఆ టికెట్​పై ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు తితిదే ప్రకటించింది. డోలోత్సవం, ఆర్జిత బ్రహోత్సవం, సహస్రదీపాలంకరణ సేవల టిక్కెట్లు పొందిన వారు మాత్రం దర్శనం కోసం 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

టికెట్లు బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని తితిదే భక్తులకు కల్పిస్తోంది. సేవా టిక్కెట్ల బుకింగ్ సమయంలోనే దర్శనం చేసుకోవాలనుకునే తేదీని భక్తులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలను ఎస్వీబీసీ లైవ్ ద్వారా భక్తులు ఇంటి నుంచే వీక్షించే సౌకర్యాన్ని కల్పిస్తూ... సేవలు జరిపే సమయంలో వారి గోత్రనామాలను ఉత్సవ మూర్తుల వద్ద ఉంచేలా ప్రణాళికలు రచించింది. ఇక నుంచి ఆర్జిత సేవల టిక్కెట్లను ప్రతి నెలా ఆఖరి వారంలో విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది.

ఇదీ చదవండి

కొవిడ్ పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.