అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ(Srivari Brahmotsavam ceremony) కార్యక్రమాన్ని నిర్వహించారు. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారిని శ్రీవారి సన్నిధి నుంచి రంగనాయకుల మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకుల వైధిక కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. కల్యాణమండపంలోని యాగశాలలో ఉత్సవాలకు అంకురార్పణ ఘట్టాన్ని పండితుల వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రేపు సాయంత్రం 5:10 నుంచి 5:30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజ స్తంభంపై ధ్వజపటం ఏగురవేస్తూ ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడంతో బ్రహ్మోత్సవాలు(Brahmotsavam ceremony) ప్రారంభమవుతాయి. రాత్రి 8:30 గంటల నుంచి ఉత్సవాలల్లో తొలి వాహనమైన పెద్దశేషవాహనసేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. కరోనా ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు (Brahmotsavam ceremony) ముస్తాబయ్యాయి. తిరుమల విద్యుత్ శోభ, ప్రధాన ప్రదేశాల్లో అలంకరణలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి..
Ysr asara: రేపు 'వైఎస్సార్ ఆసరా' పథకం రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల