అతను టిక్ టాక్ లో ఓ చిన్నపాటి హీరో.. ఆమె కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. ఎవరి రీల్స్ వారు చేసుకుంటున్నారు.. ఓ సారి ఒక వీడియోలో హీరోయిన్ ఫేస్ కట్ చూశాడు.. ఈమె కూడా హీరో కటౌట్ చూసింది.. "కళ్లూ కళ్లూ కలిసెనే.. మనసూ మనసూ మురిసెనే.." అనే బీజీఎం వేసుకున్నారు ఇద్దరూ. పరిచయాలు.. ప్రపోజ్ లు అన్నీ అయిపోయాయి. అలా.. ప్రేమదేశంలో విహరిస్తుండగా.. దేవుడు స్క్రీన్ ప్లే మార్చేశాడు. ఇద్దరూ దూరమయ్యారు.
అప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీతలాగా.. "వస్తాడు నా రాజు ఈరోజు" అనే హోప్ ఫుల్ బ్యాగ్రౌండ్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఆమె ఎదురు చూస్తూ ఉంది. కానీ.. కాలం కరిగిపోతోంది తప్ప.. హీరో మాత్రం తిరిగి రావట్లేదు. ఇట్లానే ఎదురు చూస్తూ ఉంటే.. జుట్టు తెల్లబడిపోతుందని భయపడింది. తానే బయల్దేరింది హీరోనూ వెతుక్కుంటూ..
మొత్తానికి హీరోను కలుసుకుంది.. కానీ.. అతన్ని చూడగానే హృదయం ముక్కలైంది. ఆనందంతో రావాల్సిన కన్నీళ్లు.. ఆవేదనతో ఉప్పొంగాయి. హీరో మరో హీరోయిన్ తో రిసెప్షన్ కూడా చేసుకున్నాడు. ఇక్కడ.. మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమంటే.. వీళ్లిద్దరు కూడా టిక్ టాక్ లోనే అట్రాక్ట్ అయ్యారు. పెళ్లి చేసుకొని జంటగా రీల్స్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు నా పరిస్థితి ఏంటీ? అని "సీత" తీవ్రంగా బాధపడింది. వెంటనే తేరుకుంది. ముక్కలైన హృదయాన్ని మళ్లీ అతికించుకుంది. వెళ్లి సెకండ్ హీరోయిన్ అలియాస్ ఫస్ట్ వైఫ్ తో తన లవ్ మ్యాటర్ చెప్పేసింది. ఈ ప్రేమ కథకు ఆమె కరిగిపోయింది. "ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ నువ్వే కాబట్టి.. హీరో నీకు దక్కడమే న్యాయం" అన్నది. "అతన్ని ముందు పెళ్లి చేసుకున్నది నువ్వు కాబట్టి.. నీకు అన్యాయం జరగడం న్యాయం కాదు" అన్నది ఈమె.
చివరకు ఇద్దరూ కలిసి ఓ ఆలోచ చేశారు. "నువ్వూ టిక్ టాకే.. నేనూ టిక్ టాకే.. సో.. కొంచెం అడ్జెస్ట్ చేసుకుంటే చాలు. మన హీరో హృదయంలో ఇద్దరమూ హ్యాపీగా ఫిక్స్ అయిపోవచ్చు అనుకున్నారు. ఇదే విషయం హీరోకు చెప్పారు."మీరిద్దరూ అడ్జెస్ట్ అయితే నాకేం ప్రాబ్లం..? 1 + 1 ఆఫర్ లో ఉండే కిక్కే వేరు" అన్నాడు. అలా.. ముగ్గురి ప్రేమ కథకు హ్యాపీ ఎండ్ కార్డ్ వేసుకున్నారు. పెద్ద భార్య దగ్గరుండి కాబోయే చెల్లిని అలంకరించి.. భర్త చేతిలో పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఈ ట్రయాంగిల్.. అండ్ ఇంట్రస్టింగ్ మ్యారేజ్ జరిగింది. ఇందులో హీరోది స్థానిక అంబేడ్కర్ నగర్. ఫస్ట్ హీరోయిన్ అలియాస్ సెకండ్ వైఫ్ ది వైజాగ్. సెకండ్ హీరోయిన్ కమ్ ఫస్ట్ మిస్సెస్ ది కడప. ఈ రేర్ మ్యారేజ్ మీడియాలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు "ఇదెక్కడి విడ్డూరం?" అంటే.. మరికొందరు "విశాల హృదయులు" అని కామెంట్ చేస్తున్నారు. వాళ్లు ముగ్గురు మాత్రం.. "నవ్వే వాళ్లూ నవ్వనీ.. ఏడ్చేవాళ్లూ ఏడ్వనీ.. పొగిడేవాళ్లు పొగడనీ.. తిట్టేవాళ్లూ తిట్టనీ.. #డోన్ట్ కేర్.." అనే బీజీఎం వేసుకొని రీల్స్ చేసుకుంటున్నారు.
వీటిపైనా ఓ క్లిక్కేయండి..
- "గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!
- "మిమ్మల్ని నా బంగారం అనుకున్నా.. ఛీ పోండ్రా.." రాజీనామా చేసిన యువతి..
- ఓ మంచి దేవుడా..! ఎందుకయ్యా గిట్ల చేసినవ్..?!
- అక్కడ వధూవరులను అమ్ముతున్నారు.. "మీలో ఎవరైనా షాపింగ్ చేస్తారా?"
- పోలీస్ స్టేషన్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. మేనేజర్ పోస్టు కావాలట!
- దొంగతనం చేశాను కదా.. నన్ను అరెస్టు చేయాల్సిందే!
- ఆయనకు ఇద్దరు కాదు.. 3.. 4.. 5.. 6.. 7.. 8.. 9.. 10.. 11.. ???
- వాటర్ తో అమ్మాయి "మ్యాజిక్".. 150 మంది ఖతం!
- "నీ ఫోన్ నంబర్ లో 5 ఉందిగా.. నీకు జాబ్ లేదు పో!" (డేయ్.. ఎన్నడా ఇదీ..?)
- పెళ్లైన ఏడాది తర్వాత తెలిసింది.. "మొగుడు" ఒక అమ్మాయి అని!
- "ఛీ.. ఛీ.. ఏందిరా ఈ ఛండాలమూ..?" ఉద్యోగుల టాయిలెట్లో.. సీసీ కెమెరాలు!
- "ఎవరా నేరస్థుడు?" పోలీసుల వల్ల కాలేదు.. "దోమ" పట్టించింది!
- నిద్రలో భర్త కలవరింత.. వేడి వేడి నీళ్లు "అక్కడ" కుమ్మరించిన భార్య..!
- సూపర్ బ్రాండెడ్ షూస్.. వీటి ధర ఎంతో తెలుసా..?