ETV Bharat / city

BUILDING COLLAPSE IN TIRUPATHI: తిరుపతిలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. పరుగులు తీసిన స్థానికులు - చిత్తూరులో వరద ప్రభావం తీవ్రత

తిరుపతిలోని భవానీ నగర్​లో మూడు అంతస్తుల పాత భవనం శనివారం రాత్రి ఒక్కసారిగా(three floors building collapse in tirupati) కుప్పకూలింది. దీంతో స్థానికులు పరుగులు తీశారు. భవనంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

building collapsed in tirupati
తిరుపతిలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం
author img

By

Published : Nov 27, 2021, 11:59 PM IST

Updated : Nov 28, 2021, 10:19 AM IST

Three Floors Building Collapse in Tirupati: తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న భవానీనగర్‌లో పాత భవనం కూలిన ఘటన స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ప్రాచ్య కళాశాల సమీపంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన 3 అంతస్తుల భవనం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే భవనం శిథిలావస్థకు చేరడంతో 2 ఏళ్ల క్రితం యజమానులు ఖాళీ చేశారు.

ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనం.. ఒక్కసారిగా భారీ శబ్ధంతో కుప్పకూలడంతో(building collapse at tirupati) స్థానికులు భయపడ్డారు. ఆ భవనం చుట్టూ నాలుగైదు అంతస్తుల భవనాలు ఉండగా... వాటిలో నివసిస్తున్న వారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కుప్పకూలిన భవనం యజమాని ఎంజీ శ్రీనివాసన్.. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి..

Shrinking Houses in Tirupati: తిరుపతిలో కుంగుతున్న ఇళ్ల పునాదులు.. వణికిపోతున్న ప్రజలు

Last Updated : Nov 28, 2021, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.