ETV Bharat / city

తిరుమల వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజన రద్దు !

వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి సంకల్పించారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు
author img

By

Published : Jul 2, 2019, 6:46 AM IST

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి సంకల్పించారు. దీనిపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి.. త్వరలో పూర్తిస్థాయిలో ఏర్పాటు కానున్న ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది అమలులోకి వస్తే.. బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన అందరికీ సమానంగా స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనం టికెట్లు మూడు కేటగిరీల్లో విభజించి కేటాయిస్తున్నారు. అత్యంత ప్రముఖులకు లిస్టు-1గా, ఇతరులకు స్థాయిని బట్టి లిస్టు-2గా టికెట్లు మంజూరు చేస్తున్నారు. సాధారణ సిఫార్సులను లిస్టు-3 కింద పరిగణిస్తున్నారు. అన్ని కేటగిరీలకు సిఫార్సు తప్పనిసరి కావడంతో రూ.500 కట్టాల్సిందే. లిస్టు-1 కింద టికెట్లు పొందిన భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఒత్తిడి లేకుండా నిదానంగా స్వామివారి దర్శనం చేయించడంతో పాటు తీర్థం, శఠారీ మర్యాదలు కల్పిస్తారు. వీరి తర్వాత లిస్టు-2 టికెట్లున్న వారిని ఆలయానికి అనుమతిస్తారు. వీరిని గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు అనుమతిస్తారు. అయితే.. స్వామివారిని దర్శించుకుంటూ వేగంగా ముందుకు కదలాల్సి ఉంటుంది. క్షణకాలమూ నిలబడటానికి అనుమతించరు. అనంతరం లిస్టు-3 బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను పంపించి.. మరింత వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తారు. బ్రేక్‌ దర్శనం టికెట్లను మూడు రకాలుగా విభజించడంపై విమర్శలున్నాయి.
16న కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం
శ్రీవారి ఆలయ శుద్ధిలో భాగంగా తితిదే ఈ నెల 16న కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనుంది. ఆరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం క్రతువు సుమారు 5 గంటల పాటు కొనసాగనుంది. తిరుమంజనం కారణంగా 16న శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. సర్వదర్శనం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించి చంద్రగ్రహణం నేపథ్యంలో రాత్రి 7 గంటలకు నిలిపివేయనుంది.

ఇదీచదవండి

తితిదే జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

Intro:JK_AP_NLR_01_01_FPOS_AQUA_FARMERS_RAJA_PKG_C3
anc
నాబార్డ్ సహకార సంస్థ రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తుంది. నెల్లూరు జిల్లాలో నాబార్డు సహకారంతో కేపీఎల్ మాక్స్ ద్వారా భవ్య ఆక్వా చేప రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు చేసి ఆక్వా చేపల ైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. వివిధ శాఖ ద్వారా వారికి ఉపయోగపడే పరికరాలను రాయితీతో అందజేస్తున్నారు. అయితే ఆక్వా రైతులు మార్కెటింగ్ సమస్య, ఫీడ్ సమస్య ఎక్కువగా ఉందని ఈ విషయంలో నా బోర్డ్ సహాయం అందించాలని వారు కోరుతున్నారు ఈ పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం.
వాయిస్ ఓవర్,1
నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులను ఆదుకునేందుకు నాబార్డు తమ వంతు కృషి చేస్తుంది. నాబార్డ్ సమస్త నెల్లూరు జిల్లాలో ఆక్వా చేప రైతులను కే పి ఎల్ మ్యాక్స్ ద్వారా రైతుల గ్రూపులో ఏర్పరిచి వారికి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇందుకూరుపేట మండలం లో 15 గ్రామాలలో 100 మంది ఆక్వా చేపల రైతులను గ్రూప్ గా ఏర్పరిచి వారికి అవసరమైన రేడియేటర్స్ రాయితీపై అందజేశారు. 40 వేల రూపాయలు విలువచేసే రేడియేటర్స్ ని 50 శాతం రాయితీతో మత్స్య శాఖ ద్వారా అందజేశారు. అంతే కాకుండా వారికి కేపీఎల్ మాక్స్ సలహాలు సూచనలు ఇస్తూ వారిని ముందుకెళ్తోంది.
బైట్స్, నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్2
భవ్య చేపల, ఆక్వా రైతుల ఉత్పత్తి సంగం రైతులకు ఎంతో మేలు చేస్తుందని పలువురు ఆక్వా రైతులు చెబుతున్నారు. అయితే చేపల రొయ్యల ఉత్పత్తిలో రైతులు ప్రధానంగా మార్కెటింగ్ ఫీడ్, సీడ్ గురించి ఎంత ఇబ్బందులు పడుతున్నా మని,ఈ విషయంలో నాబార్డు కే పి ఎల్ మాక్స్ రైతులనుఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఫీడ్ రాయితీతో ఇస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు రైతులు కోరుతున్నారు.
బైట్స్, రైతులు నెల్లూరు జిల్లా

వాయిస్ ఓవర్.3
రైతులను ఆదుకునేందుకు నాబార్డ్ కేపీఎల్ మ్యాక్స్ ఎంతో కృషి చేస్తుందని నా నాబార్డ్ సహాయ దారులు చెబుతున్నారు. రైతులకు మార్కెటింగ్ ఫీడ్ సమస్య లేకుండా చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని త్వరలోనే ఆ పనులు చేస్తాం అంటున్నారు.
బైట్స్, 1.మనోజ్ రెడ్డి భవ్య ఆక్వా foes, CEO, నెల్లూరు జిల్లా
2.భూపేష్ రెడ్డి ,FEOS,CEO నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్4
ఆక్వా చేపలను రైతులను రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పరిచి వారిని ముందుకు తీసుకెళ్లేందుకు నాబార్డు కృషి చేస్తుందని నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ రవి సింగ్ తెలిపారు. ఆక్వా చేపల రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయని అవి తీర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.
బైట్, రవి సింగ్ నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నెల్లూరు జిల్లా

Body:రైతు ఉత్పత్తి దారుల సంఘం

Conclusion:రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.