Srivari Parakamani: శ్రీవారి ఆలయ పరకమణిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు తితిదే అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన అధికారులు.. తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను.. మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన ఉదయం 10:30 గంటల సమయంలో చోరీ జరిగిందని తెలిపారు. నిందితుడు రూ.20 వేల నగదును అపహరించి ఆలయం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో పట్టుబడ్డారని సీఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తిరుమల విజిలెన్స్ అధికారుల విచారణలో 20 వేల నగదును అపహరించానని నిందితుడు ఒప్పుకున్నట్లు సీఐ తెలియజేశారు.
ఇవీ చదవండి :