తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు హనుమంతుడు. హనుమంతుని స్మరిస్తే ధైర్యం, ఆరోగ్యం, బుద్ది, బలం, యశస్సు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడంతో మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆలయంలోనే చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పుష్పక విమానంపై స్వామివారు విహరించనున్నారు. అనంతరం రాత్రి 7 నుంచి 9 వరకు శ్రీవారికి గజవాహన సేవ ఉంటుంది.
ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు...సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం