తిరుమలలోని ఏడుకొండలను కాలినడకన ఎక్కి... కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని చాలామంది భక్తులు దర్శించుకుంటారు. వారికి శాశ్వతంగా సౌకర్యం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అలిపిరి నుంచి తిరుమల వెళ్లే నడకమార్గంలో మెట్లపై ఉన్న కప్పు పెచ్చులూడి, భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. దీనిపై దృష్టి సారించిన తితిదే... మరమ్మతులకు పూనుకుంది. భక్తుల సంరక్షణ కోసం పైకప్పు పునర్నిర్మాణం చేపట్టారు తితిదే అధికారులు.
రిలయన్స్ సంస్థ 20 కోట్ల రూపాయల విరాళంతో ఈ పనులను చేపట్టింది. 2019 ఆగస్టు నెలలో ప్రారంభమైన పనులు... కరోనా ప్రభావం, భక్తులు నిత్యం వస్తూ ఉండడంతో త్వరితగతిన పూర్తి చేయడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. భక్తుల రాకను తాత్కాలికంగా నిషేధిస్తే పనులు వేగంగా పూర్తి చేయొచ్చని తితిదే తాజా నిర్ణయం తీసుకుంది. అలిపిరి-తిరుమల నడక మార్గంలో రోజుకు సుమారు 50 వేల మంది శ్రీవారి దర్శనానికి వస్తుంటారు.
కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని తితిదే అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:
'ఆనందయ్య ఔషధాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తితిదే సిద్ధం'