తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
తెలంగాణాలో కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాట్లు మంత్రి గంగుల తెలిపారు. కేసిఆర్ నిర్ణయాలతో తెలంగాణ మంచి ఫలితాలను సాధిస్తోందన్నారు. కేసిఆర్ కలలు సాకారం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: తిరుమల బ్రహ్మోత్సవాలు: వైభవంగా శ్రీవారి చక్రస్నానం