ETV Bharat / city

తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ఎదుట.. తెదేపా నేతల ధర్నా - ysrcp malpractice at tirupathi by elctions

తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ముందు తెదేపా నేతలు ధర్నాకు దిగారు. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేసేందుకు పెద్దఎత్తున ఇతర ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చారంటూ ఆందోళన చేపట్టారు.

tdp protest at tirupathi sp office
తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా నేతల ధర్నా..
author img

By

Published : Apr 17, 2021, 9:50 AM IST

తిరుపతిలో ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా నేతల ధర్నా..

తిరుపతిలో తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు ధర్నాకు దిగారు. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లలో తిరుపతి వచ్చిన వైకాపా మద్దతుదారులు.. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళనకు దిగారు.

పీఎల్‌ఆర్‌ గ్రాండ్‌ ఫంక్షన్‌ హాలు వద్దకు చౌడేపల్లి నుంచి వచ్చిన కొందరిని తెదేపా నేతలు పట్టుకుని మీడియాకు చూపించారు. ఎస్పీ కార్యాలయం ముందు తెదేపా నేతలు ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సును తెదేపా శ్రేణులు ఆపి పోలీసులకు అప్పగించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు బహిరంగ సభకు వచ్చినట్టు తిరుపతికి వస్తున్నారని ఆగ్రహించారు.

ఇదీ చదవండి:

ప్రారంభమైన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.