తిరుపతి ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని తెదేపా ఎంపీలు ఆరోపించారు. ఉపఎన్నిక నిర్వహణలో ఈసీ విఫలమైందని పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. ఈరోజు జరిగిన ఆయా ఘటనలపై ఇప్పటికే సీఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అన్నిచోట్ల దొంగఓట్లు వేశారనీ.. నకిలీ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల వారిని తిరుపతికి తీసుకొచ్చారన్నారు. అందుకే పోలింగ్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ.. దండెత్తిన దొంగ ఓటర్లు..!
తిరుపతిలో ఓటు వేయడానికి స్థానిక ప్రజలు భయపడిపోయారని తెదేపా ఎంపీలు అన్నారు. అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. వైకాపా మినహా అన్ని పార్టీలూ దొంగ ఓటర్లను పట్టుకున్నాయన్నారు. కడప నుంచి తీసుకొచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా.. వారు తిరుమలకు వచ్చారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినవాళ్లను యాత్రికులను చేసిన ఘనత వైకాపాదేనని విమర్శించారు.
ఇదీ చదవండి: 'ప్రచారంలో పాల్గొనడం మోదీ నిర్లక్ష్యానికి ప్రతీక'
నోడల్ అధికారుల నుంచి వివరాలు తీసుకొని ఎన్నికల సంఘం విచారణ జరపాలని తెదేపా పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి ఉపఎన్నికపై ఉదయం నుంచి మీడియాలో వస్తున్న అన్ని కథనాలను పరిశీలించాలని ఈసీని కోరినట్లు వెల్లడించారు. ప్రజాస్వామబద్ధంగా ఎన్నికలు జరగలేదు కాబట్టి రద్దు చేయాలన్నారు. దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి పరిశీలకులు తీసుకురావడం లేదని ఆరోపించారు. దొంగ ఓటర్లపై పోలీసులూ ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారన్నారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగంతోనే ఈ ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. ఎన్నికల సంఘం స్పందన అనంతరం తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
ఇదీ చదవండి: