చిత్తూరులో తెదేపా నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరుగకుండా ముందస్తుగా తెదేపా నేతలను అరెస్టు చేశారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఇతర నాయకులను పార్టీ జిల్లా కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారు.
ఇదీ చదవండి: సీఎం ఇంటి ముట్టడికి భజరంగ్ దళ్ పిలుపు.. భారీ భద్రత