తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి నుంచి 15 వరకు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ తిరుపతికి చేరుకున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నారు.
సమన్వయం, ప్రచార బాధ్యతలు...
ప్రచార పర్వం ముగిసే వరకూ అక్కడే ఉండి నాయకుల మధ్య సమన్వయం, ప్రచార బాధ్యతలను లోకేశ్ చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లాలోని 4 నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఘన స్వాగతం...
విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తొలుత రేణిగుంట చేరుకున్న లోకేశ్‌కి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వై కన్వెన్షన్ సెంటర్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి ఇంచార్జ్ బోజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు.
ఇదీ చదవండి: