విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. శారదా పీఠం మఠంలోని జగద్గురు స్వామీజీ విగ్రహం వద్ద సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆధ్యాత్మిక చింతనలో వర్ధిల్లాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు.
ఇదీచదవండి