అశ్లీల దృశ్యాల ఘటనలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. తాజాగా ఎడిటర్‌తో పాటు మరో ఇద్దరిని పదవి నుంచి తొలగించారు. ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే 'శతమానం భవతి' కార్యక్రమంలో తమ కుమారుడి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వీడియో పంపాలని భక్తుడు వెంకటకృష్ణ తితిదేను కోరారు. జన్మదిన శుభాకాంక్షల దృశ్యాల లింక్ పంపాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగలు అశ్లీల దృశ్యాల వీడియోలతో కూడిన లింక్ పంపారు. దీనిపై వెంకటకృష్ణ తితిదే ఛైర్మన్, ఈఓలకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.
భక్తుడు ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన తితిదే సైబర్ సెక్యూరిటీ విజిలెన్స్ అధికారులు ఎస్వీబీసీ ఉద్యోగుల కంప్యూటర్లను సీజ్ చేశారు. విచారణలో భాగంగా తొలుత ఏడుగురిని విధుల నుంచి తొలగించారు. ఇవాళ ఎడిటర్ కృష్ణారావుతో పాటు సీనియర్ మేనేజర్లు మరో ఇద్దరిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అశ్లీల దృశ్యాల ఘటనలో ఎస్వీబీసీ ఉద్యోగులను పది మందిని విధుల నుంచి తొలగించనట్లైంది.
ఇదీ చదవండి: ఇడుపులపాయలో విద్యార్థుల మధ్య ఘర్షణ..