తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) ఛైర్మన్ పృథ్వీ బాలిరెడ్డి పాల్గొన్నారు. ఛానల్లో పనిచేసే 270 మంది ఒప్పంద ఉద్యోగులను పర్మినెంట్ చేయడమే తన ధ్యేయమని... దీనికోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాళ్లు పట్టుకోవడానికీ వెనకాడనని అన్నారు. శ్రీవారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. శ్రీవారి లీలలతో కూడిన అంశాలను ఒక నిమిషం నిడివితో ప్రత్యేక లఘు చిత్రాలను చిత్రీకరిస్తున్నామని... ప్రముఖుల వ్యాఖ్యానంతో ఇవి రూపొందిస్తామన్నారు. ఎస్వీబీసీ యాప్ ద్వారా స్వామి వారి విశేషాలను భక్తులకు మరింత చేరువ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తిరుపతిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నానని... నెలలో ఇరవై రోజులు తిరుపతిలో ఉండి ఎస్వీబీసీ ద్వారా స్వామివారి చరిత్రను దశదిశలా వ్యాప్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి :