తిరుపతిలోని ప్రైవేట్ ల్యాబ్లు, హెల్త్ కేర్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న తమకు ఆయా యాజమాన్యాలు జీతాలు చెల్లిచటం లేదంటూ కోవిడ్ విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది ఆందోళన బాట పట్టారు.తామంతా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధుల్లో పాల్గొంటున్నా.... జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నెల జీతం మాత్రమే ఇచ్చి అవస్థలకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఆరోగ్య సిబ్బంది మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి
భక్తులకు అందుబాటులో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు