తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో కన్నుమూశారు. 4 రోజుల క్రితం కరోనాతో స్విమ్స్‌లో చేరిన ఆయన... గురువారం తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసాచార్యులు మధుమేహంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు స్విమ్స్ వైద్యులు వెల్లడించారు.శ్రీనివాసాచార్యులు కొన్నాళ్ల క్రితం గోవిందరాజస్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు.
అర్చకుడు శ్రీనివాసాచార్యులు మృతిని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అధికారికంగా ప్రకటించింది. తిరుమలలో కైంకర్యాలు నిర్వహించే అర్చకుడి మృతిపై తితిదే ఛైర్మన్, ఈవో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్చకుడి మృతి దురదృష్టకర ఘటన అని.. ఆయన కుటుంబానికి తితిదే నిబంధనల ప్రకారం సహాయం చేస్తామని ప్రకటించారు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
ఇదీ చదవండి