ETV Bharat / city

శ్రీదేవి భూదేవి సమేతంగా.. గోవిందరాజస్వామివారి విహారం - undefined

తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం కనులవిందుగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

శ్రీదేవి భూదేవి సమేతంగా.. గోవిందరాజస్వామివారి విహారం

author img

By

Published : Feb 7, 2020, 12:11 AM IST

శ్రీదేవి భూదేవి సమేతంగా.. గోవిందరాజస్వామివారి విహారం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వారికి తెప్పోత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 6.30 గంటల నుంచి 8.00 గంటల వరకు స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఆలయ నాలుగు మాఢ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

శుక్ర‌, శ‌ని వారాల్లోనూ ఈరోజు లాగానే శ్రీగోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు సార్లు పుష్కరిణిలో తిరిగి భక్తులకు కనువిందు చేస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయ్య‌ర్‌స్వామి, చిన్న జీయ్య‌ర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ శ‌ర్మ‌, శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఏ.పి.శ్రీ‌నివాస దీక్షితులు,టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు, ఇతర అధికారులు హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

god
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.