ETV Bharat / city

VACCINE DRIVE: 'కేంద్రానికి మన సామర్ధ్యం తెలిపేలా.. స్పెషల్ డ్రైవ్' - AP Latest News

ఒక్కరోజులోనే 9 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేయటం ద్వారా... రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ సామర్ధ్యాన్ని కేంద్రానికి నివేదిక రూపంలో వివరించనున్నట్లు... వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని నెహ్రూనగర్​ పట్టణ ప్రాథమి ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా.. అనిల్ సింఘాల్​తో పాటు ఉన్నారు.

వాక్సినేషన్
వాక్సినేషన్
author img

By

Published : Jun 20, 2021, 4:18 PM IST

అనిల్ కుమార్ సింఘాల్

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. రోజువారి నమోదవుతున్న పాజిటివ్ కేసులు 5-6వేలకు తగ్గాయన్న సింఘాల్.. యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. రేపటి నుంచి తూర్పుగోదావరి జిల్లా మినహా మిగతా జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని వివరించారు.

రాష్ట్రంలో సుమారు 96 లక్షల మందికి ఒక్క డోస్ వ్యాక్సిన్ ఇవ్వగలిగామన్న సింఘాల్.. కేంద్రం నుంచి కొత్తగా వచ్చిన 9 లక్షల డోసులు ఈ ఒక్కరోజే వేయాలని డ్రైవ్ చేపట్టామని వివరించారు. ఈరోజు 9 లక్షలకుపైగా వాక్సిన్​లు వేసి.. రాష్ట్రంలో వాక్సినేషన్ సామర్ధ్యంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోగలిగేలా మందులు, ఇంజెక్షన్లు, పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఎంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లు ఆర్డర్ పెట్టామన్న సింఘాల్.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతేనే అసలైన ప్రమాదమని గుర్తించాలని కోరారు.

ఇదీ చదవండీ... RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.