ప్రజల డబ్బునే రాష్ట్ర ప్రభుత్వం.... పథకాల పేరిట పంచుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తిరుపతిలో తూర్పు మండల భాజపా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్రం నిధులు వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తమ పనిగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.
పేద ప్రజలకు ఇళ్లు, పట్టాలు అన్నీ కేంద్రమే ఇస్తోందని స్పష్టం చేశారు. ఇది కాదు అంటే.. నిరూపించి చూపాలని వీర్రాజు సవాల్ విసిరారు. ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించారని విమర్శించారు.
ఇదీ చదవండి: