అక్రమంగా రవాణా చేస్తున్న 49 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన తిరుపతి సమీపంలోని పెరుమాళ్ల పల్లి వద్ద జరిగింది. దుంగలను రవాణా చేయడానికి.. స్మగ్లర్లు ఉంచిన వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఎస్వీ జూ పార్క్ వెనుక వైపునున్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎర్రచందనం దుంగలను వాహనంలోకి చేరవేస్తున్న స్మగ్లర్లను పోలీసులు గుర్తించారు. దీంతో స్మగ్లర్లు దుంగలను వదిలి పారిపోయారు. దుంగలతో పాటు, స్మగ్లర్ల వెంట తెచ్చుకున్న 3 బస్తాల బియ్యం, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ పేర్కొన్నారు.
49 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... వాహనం సీజ్ - చిత్తూరు తాజా న్యూస్
తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణా చేయడానికి స్మగ్లర్లు ఉంచిన వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.