తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి .."స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్" పేరుతో తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి కపిలతీర్థం సమీపంలోని నంది కూడలి వరకు గరుడ వారధి నిర్మాణాలు చేపట్టారు. తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్, తితిదే సంయుక్తంగా..684 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 కిలోమీటర్ల మేర గరుడ వారధి నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకున్నారు. వీటిలో తితిదే 458 కోట్లు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 226 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. తితిదే నిధుల కేటాయింపులో జాప్యం...గరుడ వారధి నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది.
బస్టాండ్ కూడలి నుంచి కపిలతీర్థం వరకు పనులు చివరి దశకు చేరగా.. మిగిలిన ప్రాంతంలో ప్రారంభ దశలో ఉన్నాయి. బస్టాండ్ నుంచి వాహనాల రాకపోకలను అనుమతించేందుకు వీలుగా పనులు పూర్తిచేసి...జులై చివరి నాటికి తొలి దశ గరుడ వారధిని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
మార్కెట్ యార్డు నుంచి జాతీయ రహదారి వరకు, కపిలతీర్థం నుంచి అలిపిరి గరుడ కూడలి వరకు నిర్మాణాలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తితిదే ఛైర్మన్ ప్రకటించారు.
ఇదీచదవండి
'ప్రజల్ని విభజించి పాలిస్తున్న జగన్‌రెడ్డి.. మూర్ఖమంత్రిగా నిలిచారు'