తిరుపతి నగర శివార్లలో ఉన్న సీతమ్మ ట్రస్ట్ భూములను(Sithamma Trust Lands) స్వాధీనం చేసుకునేందుకు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే వారి ప్రయత్నాల్ని.. ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నేతలు అడ్డుకున్నారు. నగరపాలక సంస్ధ భూముల చుట్టూ ఉన్న ప్రహరీలను కూల్చడంపై నిరసనకు దిగారు. ఆక్రమణలు తొలగించి భూములను ట్రస్ట్ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా అధికారులు వాటిని అమలు చేయడం లేదని ట్రస్ట్ సభ్యులు ఆరోపించారు.
కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నగరపాలక సంస్థ.. సీతమ్మ ట్రస్ట్ భూములను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే పరిస్ధితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీతమ్మ ట్రస్ట్ భూములను కాపాడుకునేందు ఎంతకైనా వెనకాడమని స్పష్టం చేశారు.